హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): గతంతో పోలిస్తే రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గడం ఆందోళనకరమని, కూరగాయల సాగును ప్రోత్సహించాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పేరొన్నారు. ఒకప్పుడు 5.52 లక్షల ఎకరాలకు పైగా ఉన్న కూరగాయల సాగు, ప్రస్తుతం లక్ష ఎకరాల మేర తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఉద్యాన పంటల విస్తరణకు కార్యాచరణ అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు రూపొందించిన సమగ్ర నివేదికను ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డికి సమర్పించినట్టు కోదండరెడ్డి తెలిపారు.
మంగళవారం బీఆరే భవన్లో కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, గోపాల్‌రెడ్డి, రాములునాయక్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పంటల మార్పిడిని అమలుచేయాలంటే రాష్ట్రస్థా యి కమిటీని ఏర్పాటుచేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు తెలిపారు. ఈ ప్రతిపాదనకు వ్యవసాయశాఖ మంత్రి సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. పంటల మార్పిడికి నాబార్డ్ కూడా సహకరించేందుకు ముందుకు వచ్చినట్టు చెప్పా రు. వాతావరణ మార్పులు, భూసార క్షీణత, నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని పంటల మార్పిడిని అమలుచేయాలని సూ చించారు. ఎల్‌నినోను దృష్టిలో ఉంచుకుని తకువ నీటితో అధిక దిగుబడి వచ్చే పంటల వైపు దృష్టి సారించాలని కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి సూచించారు.