హైదరాబాద్, డిసెంబర్9 (నమస్తే తెలంగాణ): డిసెంబర్ 9న ఏటా అధికారికంగా తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత శాసనసభలో ప్రకటన చేశారు. సోమవారం సాయంత్రం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన కాంగ్రెస్ నేత సోనియాగాంధీకి అసెంబ్లీ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమంలో పనిచేసిన కవి, గాయకులు గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి, అందెశ్రీ, గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరి, ఎకా యాదగిరి రా వుకు 300 గజాల ఇంటి స్థలంతోపాటు కోటి నగదు, తామ్ర పత్రం అందిస్తామన్నారు. 16కు అసెంబ్లీ వాయిదా పడింది.