వేములవాడ టౌన్, జూన్ 2: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శివారులోని తిప్పాపు రం గోశాలలో అనారోగ్యంతో బాధపడుతున్న మూడు కోడెలు మృతిచెందాయని, మరో ఆరు కోడెల పరిస్థితి విషమంగా ఉందని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అనారోగ్య పరిస్థితుల కారణంగా గోశాలలో మొదట 8కోడెలు మృతిచెందాయన్నారు. ఐదుగురు వెటర్నరీ డాక్టర్లతో కూడిన 12 మంది వైద్య బృందం కోడెలను పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. అనారోగ్యం పాలైన 20 కోడెలకు ప్రత్యేకంగా చికిత్స అందించి 16 కోడెలను కాపాడామని, రెండో రోజు మరో 4 కోడెలు మృతిచెందాయని తెలిపారు.