మద్దూరు (ధూళిమిట్ట), ఆగస్టు 5: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం కూటిగల్కు చెందిన ఓ యువకుడు అమెరికాలో అనుమానాస్పదంగా మృ తి చెందాడు. తుషాలపురం మంగవ్వ -మహదేవ్ల పెద్ద కుమారుడు సాయి రోహిత్ (23) హైదరాబాద్ సీవీఆర్ కాలేజీలో 2022లో బీటెక్ పూర్తి చేశాడు. ఎమ్మెస్సీ చదివేందుకు నిరుడు డిసెంబర్ 20న అమెరికాకు వెళ్లాడు.
వాషింగ్టన్ సియోటెల్లోని యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరి కాలేజీ యూనియన్ బ్రాంచ్లో చదువుకుంటూ స్నేహితులతో కలిసి రూమ్లో ఉంటున్నాడు. జూలై 22న బయటకెళ్లి, తిరిగి క్యాబ్లో రూముకు వస్తుండగా కొంత దూరం రాగానే మరో క్యాబ్లోకి మారాడు. అప్పటి నుంచి కనిపించకుండా పో యాడని స్నేహితుడు అవినాశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తానా సహాయంతో సాయిరోహిత్ కోసం వెతకగా జూలై 24న సమానుష్ సరస్సులో మృతదేహం లభ్యమైంది. జూలై 25న సాయిరోహిత్ మృతి విషయమై స్నేహితులు కూటిగల్లోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.