రాయికల్, అక్టోబర్ 26 : ఇంట్లో కూర ఎందుకు వండలేదని అడిగినందుకు భార్య ఆత్మహత్య (Suicide) చేసుకున్న ఘటన జగిత్యాల (Jagtial) జిల్లా రాయికల్ మండలం రామాజీపేటలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. రామాజీపేటకు చెందిన దొడిమెళ్ల సుధాకర్‌కు, భూపతిపూర్ గ్రామానికి చెందిన మనోజ(27)తో తొమ్మిదేండ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు.
ఈ నెల 25న రాత్రి ఇంటికి వచ్చిన సుధాకర్ భోజన సమయంలో కూర లేకపోవడంతో ఎందుకు వండలేదని భార్యను ప్రశ్నించాడు. దీంతో ఆమె బెడ్రూంలోకి వెళ్లి గడియవేసుకుంది. సుధాకర్ తలుపు ఎంత కొట్టినా తీయకపోవడంతో స్థానికుల సాయంతో పగులగొట్టి చూడగా, ఫ్యాన్‌కు ఉరేసుకుంది. మనోజ తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రాయికల్ ఎస్ఐ సుధీర్ రావు పేరొన్నారు.
నిజాంసాగర్, అక్టోబర్ 26: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం ఆరేడ్కు చెందిన గాండ్ల బసప్ప(38) విద్యుత్తు షాక్‌తో మృతి చెందినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బసప్పకు నిజాంసాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతంలో అర ఎకరం భూమి ఉన్నది. తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న మోటర్‌ను ఆదివారం పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు సరఫరా కావడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.