కాళేశ్వరం, డిసెంబర్ 7: కాళేశ్వరం ప్రాజెక్టులోని గ్రావిటీ కెనాల్లో గురువారం ప్రమాదవశాత్తు దుప్పి పడిపోవడంతో అటవీ అధికారులు కాపాడారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నేపల్లి పంప్‌హౌస్ నుంచి అన్నారం బరాజ్‌కు నీటిని తరలించే గ్రావిటీ కెనాల్లో దుప్పి పడటంతో ప్రయాణికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ రేంజర్ కమల సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి దుప్పిని బయటకు తీశారు. అనంతరం దానికి వైద్య పరీక్షలు చేయించి అడవిలో వదిలి పెట్టారు.