హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ( Intermediate Supplementary) పరీక్షల ఫీజు( Exam Fees ) గడువును ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి చెందిన రెగ్యులర్ విద్యార్థులతో పాటు , ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయడానికి ఈనెల 23 వ తేదీ వరకు పొడిగించినట్లు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు.
2025-26 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలు ఈనెల 12న విడుదలయ్యాయి. కాగా ఈ పరీక్షలో ఉత్తీర్ణులై మార్కులు ఎక్కువ సాధించాలని భావించే విద్యార్థులు, ఫెయిలైన విద్యారులకు మే 13 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 22 నుంచి 25 వరకు ప్రాక్టికల్స్, మే 26న ఫస్టియర్, సెకండియర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్స్, 28న ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్ పరీక్ష, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహించనున్నారు.