హైదరాబాద్, డిసెంబర్6 (నమస్తే తెలంగాణ): ఈ నెల 20 వరకు హజ్ యాత్ర దరఖాస్తుల స్వీకరణ గడువు ఉన్నదని తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ సలీం తెలిపారు. ఈ ఏడాది హజ్ యాత్ర కోసం తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ దరఖాస్తులను స్వీకరిస్తున్నది. ఈ మేరకు నాంపల్లి హజ్‌హౌస్‌లో ఉచిత ఆ న్‌లైన్ హజ్ అప్లికేషన్ ఫెసిలిటేషన్ కౌంటర్‌ను సలీం బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో హజ్ కమిటీ ఏఈవో ఇర్ఫాన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.