హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ) : బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు గడుపు 16వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి సైదులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 2026- 27విద్యా సంవత్సరానికి అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు mjptbcwreis.telangana.gov.in, https://mjptbcadmissions.org/ MJP- Degree/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. మరిన్ని వివరాలకు 040 23328266 నంబర్లో సంప్రదించాలని కోరారు.