DDMS | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని దుర్గాబాయ్ దేశముఖ్ మహిళా సభ (డీడీఎంఎస్) లిటరసీ హౌజ్‌లో వివిధ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సర్టిఫికెట్ కోర్సులైన ఎంఎస్ ఆఫీస్ ఇంటర్నెట్, ట్యాలీ ప్రైమ్, బ్యూటీషియన్ కోర్సులతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కెరీర్ గైడెన్స్, పైథాన్, టైలరింగ్, డిజైనర్ బ్లౌజెస్, డ్రెస్ డిజైనింగ్, మగ్గం వర్క్, జూట్ బ్యాగ్ మేకింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ తదితర కోర్సుల్లో అన్ని వయసుల వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.
వేసవి నేపథ్యంలో ఏడేళ్ల పైబడిన పిల్లలకు పాట్ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్, డిజైనర్ పేపర్ బ్యాగ్స్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, యోగా, ఫ్లవర్ మేకింగ్, జ్యువెలరీ మేకింగ్ తదితర కోర్సులను అందిస్తున్నట్లు వివరించారు. ఈ కోర్సులలో చేరేందుకు ఆసక్తి ఉన్న వారు వచ్చే నెల 6వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కోర్సులు విద్యార్థులు, నిరుద్యోగ యువత, గృహిణిలకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. సీట్లు పరిమితమని, ముందు వచ్చిన వారికి ప్రథమ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తామన్నారు. కోర్సుల్లో చేరేందుకు ఎటువంటి వయోపరిమితి లేదని స్పష్టం చేశారు. కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేస్తామని చెప్పారు. ఇతర వివరాలకు 6281139282 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.