కాజీపేట, అక్టోబర్ 24: మల్టీ జోన్ (వీఆర్)లో ఉన్న ఇన్స్పెక్టర్ రవికుమార్‌పై నమోదైన పోక్సో కేసును డీసీపీ విచారణ చేపట్టారు. హనుమకొండ జిల్లా కాజీపేట లోని ఓ అపార్ట్మెంట్లో సీఐ కుటుంబం ఉంటుంది. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న ఆయన కూతురు స్నేహితురాలిని ఈనెల 9న సీఐ లైంగిక వేధింపులకు గురిచేసినట్టు బాధితురాలు తల్లిదండ్రులు మంగళవారం కాజీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
సీఐపై పోక్సో కేసు నమోదుకాగా.. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్‌ఝా వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమాను విచారణకు ఆదేశించారు. డీసీపీ గురువారం సదరు అపార్ట్మెంట్లోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. సీఐతోపాటు బాలిక కుటుంబ సభ్యులను విచారించారు.