మెదక్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా ఆ పార్టీ నాయకులు గురువారం మెదక్ పట్టణంలో క్రిస్టల్ గార్డెన్ నుంచి పోస్టాఫీసు వరకు నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రచారరథంపై ఏర్పాటు చేసిన డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఫొటో నాయకుల మధ్య చిచ్చుపెట్టింది. ఈ విషయమై పీసీసీ ప్రతినిధి మ్యాడం బాలకృష్ణ అనుచరులు, తిరుపతిరెడ్డి అనుచరులు పరస్పరం గొడవకు దిగారు. కొద్దిసేపు ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి సాక్షిగా ఈ ర్యాలీ రసాభాసగా మారడం గమనార్హం.