తండ్రిని గెంటేసిన కూతుళ్లు
తన ఇద్దరు బిడ్డలను కంటికి రెప్పలా సాకిన ఓ తండ్రి ఆశలన్నీ అడియాసలయ్యాయి. వృద్ధాప్యంలో అక్కున చేర్చుకోవాల్సిన ఆ బిడ్డలే తండ్రి సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ హింసించడం మొదలుపెట్టారు.
- పెండ్లిచేసి ఆస్తులు పంచాక తండ్రి పట్ల అమానుషం
- ఆస్తిని ఇప్పించాలని ఆర్డీవోకు ఫిర్యాదు చేసిన వృద్ధుడు
కంటోన్మెంట్. ఫిబ్రవరి 12: తన ఇద్దరు బిడ్డలను కంటికి రెప్పలా సాకిన ఓ తండ్రి ఆశలన్నీ అడియాసలయ్యాయి. వృద్ధాప్యంలో అక్కున చేర్చుకోవాల్సిన ఆ బిడ్డలే తండ్రి సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ హింసించడం మొదలుపెట్టారు. అనారోగ్యం బారిన పడిన తండ్రిని అమానవీయంగా ఇంటి నుంచి గెంటివేయగా, బస్తీవాసులు మానవత్వంతో చేరదీశారు.
మారేడుపల్లి పీఎస్ పరిధిలోని పికెట్ సెకండ్లక్ష్మీనగర్కు చెందిన మిథాని రిటైర్డ్ ఉద్యోగి రాజలింగం(70) తన భార్య మరణించిన తర్వాత ఇద్దరు కూతుళ్లు భాగ్యలక్ష్మి(ప్రైవేట్ ఉద్యోగి), ఝూన్సీ(ప్రభుత్వఉద్యోగి)కి 130 గజాల స్థలం, 15 తులాల బంగారు అభరణాలను 2018లో సమానంగా పంచాడు. ప్రస్తుతం రాజలింగం అనారోగ్యానికి గురికావడంతో ఇద్దరు కూతుళ్లు పట్టించుకోవడం మానేశారు.
ఇంటి నుంచి గెంటేయగా, బస్తీవాసులు అక్కున చేర్చుకున్నారు. దీంతో ఇద్దరు కూతుళ్లపై పోలీసులతో పాటు సికింద్రాబాద్ ఆర్డీవోకు ఆయన ఫిర్యాదు చేశాడు.. తల్లిదండ్రుల, సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం 2007 సెక్షన్ 23 ప్రకారం తన ఆస్తిని తిరిగి ఇప్పించాలని, కుమార్తెలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరాడు. దీంతో రాజలింగం కుమార్తెలకు ఆర్డీవో నోటీసులు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

