మున్సిపల్ ఎన్నికల్లో వరదలా నల్లధనం
సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికల్లో నల్లధనం వరదలా పారిందని, మన ప్రజాస్వామ్య వ్యవస్థ రోజురోజుకూ కుప్పకూలిపోతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఆదేవన వ్యక్తంచేశారు.
- ఇది ప్రజాస్వామ్య మనుగడకు పెనుముప్పు
- మొయినాబాద్‌లో ఒక్కో ఓటుకు 70వేలు పంపిణీ
- గెలిచిన అభ్యర్థుల ఖర్చులపై ఆడిట్ నిర్వహించాలి
- ఎన్నికల సంఘానికి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు లేఖ
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికల్లో నల్లధనం వరదలా పారిందని, మన ప్రజాస్వామ్య వ్యవస్థ రోజురోజుకూ కుప్పకూలిపోతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఆదేవన వ్యక్తంచేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన ఉదంతం, మన ప్రజాస్వామ్య మనుగడకు ఎదురవుతున్న పెను ప్రమాదానికి రానున్న సంకేతంగా ఉన్నదని పేర్కొన్నారు. దీనిపై ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ ద్వారా ఫిర్యాదుచేశారు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు ఓటర్లను, చివరకు ఎన్నికల యంత్రాంగాన్ని సైతం ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. ఎన్నికల్లో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం, గెలిచిన తర్వాత అధికారాన్ని అడ్డంపెట్టుకొని ప్రజాధనాన్ని కొల్లగొట్టడం అనే ప్రమాదకరమైన సంస్కృతి రాజ్యమేలుతున్నదని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
మొయినాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఒక స్వతంత్ర అభ్యర్థి సుమారు రూ.7 కోట్ల భారీ మొత్తాన్ని ఖర్చు చేసి, దాదాపు 200 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచినట్టు తెలిసింది అని ఆరోపించారు. ఒక్క ఓటుకు రూ.70 వేల నగదు, ప్రతి ఇంటికీ 25 కిలోల బియ్యాన్ని ఇచ్చి ప్రలోభపెట్టారని ఆరోపించారు. మొయినాబాద్ మొదలు.. రాష్ట్రమంతటా, మనం చూస్తున్నది ప్రజల తీర్పు కాదని పేర్కొన్నారు. ఎన్నికల్లో డబ్బు పెట్టిన వారే పీఠం ఎక్కుతున్నారని, ఇది రాజకీయ ప్రక్రియ కాదని తెలిపారు. గెలిచిన అభ్యర్థి ఎన్నికల ఖర్చులు, ఆస్తులపై ప్రత్యేకంగా ఆడిట్ నిర్వహించాలని, ఈ భారీ మొత్తంలో నిధులు ఎక్కడి నుంచి వచ్చాయోనని ఏసీబీతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

