హైదరాబాద్: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఇంటర్ విద్యార్థులకు సెలవులు ఇచ్చింది. గతంలో సెప్టెంబర్ 28 నుంచి ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. అయితే తాజాగా ఒక రోజు ముందుగానే దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 21 నుంచే రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు హాలీడేస్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, అన్ని కాలేజీలు సెలవుల షెడ్యూల్ను తప్పకుండా పాటించాలని, క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డ్ హెచ్చరించింది.