వరంగల్: ప్రసిద్ధ భద్రకాళీ ఆలయంలో (Bhadrakali Temple) దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజైన నేడు భద్రకాళి అమ్మవారు అన్నపూర్ణ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళీ శేషు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం ఆలయ ప్రాంగణంలో భక్తులు బారులు తీరారు. ఉత్సవాల్లో తొలిరోజైన గురువారం.. భద్రకాళీ మాత బాలాత్రిపురసుందరిగా దర్శనమిచ్చారు.
ఇక భద్రాచలం రామాలయంలో దేవీశరన్నవరాత్రి మహోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆదిలక్ష్మి అలంకరణలో శ్రీలక్ష్మీతాయారు అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష అభిషేకం, అలంకార దర్శనం నిర్వహించారు. మధ్యాహ్నం మహా నివేదన, అనంతరం సామూహిక కుంకుమార్చన నిర్వహిస్తారు. సాయంత్రం విశేష దర్బారు సేవ, మంత్ర పుష్పం, తిరువీధి సేవ నిర్వహించనున్నారు.