OU Doctorate | ఉప్పల్, మార్చి 8 : ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి కవిత అర్థశాస్త్ర విభాగంలో పీహెచ్డీ పట్టాను పొందారు. మహబూబాబాద్ జిల్లా హరిపిరాల గ్రామానికి చెందిన దాస కవిత తొర్రూరు ప్రభుత్వ పాఠశాలలో విద్య అభ్యసించి, ఉన్నత విద్య ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో పాటు పట్టుదలతో ఉస్మానియా యూనివర్సిటీ నుండి (ఎకనామిక్స్) అర్ధశాస్త్రంలో పీహెచ్డీ పట్టా పొందారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో పీజీ టీచర్‌గా పని చేస్తున్న కవిత ‘ప్రాబ్లమ్స్ అండ్ ప్రాస్పెక్టస్ ఆఫ్ ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) స్కీం ఇన్ తెలంగాణ స్టేట్ స్టడీ ఆఫ్ సెలక్టెడ్ డిస్ట్రిక్ట్స్’ అనే అంశంపై ప్రొఫెసర్ ఎం. రాములు పర్యవేక్షణలో పీహెచ్డీ పూర్తి చేయడం జరిగింది. చిన్నప్పటి నుంచి ఏదైనా సాధించాలనే ఉద్దేశంతో లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని కష్టపడి చదవడం ద్వారానే నేడు డాక్టరేట్ అవ్వడం సంతోషంగా ఉందని కవిత ఈ సందర్భంగా తెలిపారు. తన చదువుకు సహకరించిన ప్రొఫెసర్ రాములు, ఇతర ప్రొఫెసర్లకు, వీసీకి కృతజ్ఞతలు తెలిపారు.