హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): తిరుమలలో రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ఫిబ్రవరి 4న సిఫారసు లేఖల దర్శనాలు, సర్వదర్శనం టోకెన్లు పూర్తిగా రద్దు చేశామని తెలిపారు. శుక్రవారం టీటీడీ పాలకమండలి సమావేశం అనంతరం ఆయ న మీడియాతో మాట్లాడారు. శ్రీవారి ద ర్శనానికి నేరుగా వచ్చే భక్తులకు వైకు ంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా అనుమతిస్తామని తెలిపారు. అనంతరం తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన భక్తురాలు శైలజకు రూ.2లక్షల డీడీని బోర్డు సభ్యులతో కలిసి అందజేశారు. కాగా, తిరుమల వేంకటేశ్వరస్వామికి చెన్నైకి సెన్సార్ క్యాపిటల్ కంపెనీ ఎండీ, సీఈవో వెంకటేశ్ కన్నపన్ రూ. కోటి డీడీని విరాళంగా అందజేశారు.
నకిలీ టికెట్ల కలకలం..
శ్రీవారి దర్శనానికి నకిలీ టికెట్లతో వచ్చిన భక్తులను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్కు చెందిన నళినికాంత్ సహా మరో ఇద్దరు భక్తులు వైకుంఠం క్యూలైన్లో దర్శనానికి రాగా వారి టికెట్ సాన్ కాకపోవడంతో వెన కి పంపారు. సతీశ్ అనే దళారీ రూ.10లక్షల దాతల నకిలీ టికెట్లను ముగ్గురు భక్తులకు ఇచ్చి వారి వద్ద రూ. 2,100 వసూలు చేసినట్టు గుర్తించారు. భక్తుల ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.