హైదరాబాద్, నవంబర్ 22(నమస్తే తెలంగాణ): ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ సోమవారం తన పదవికి రాజీనామా చేస్తారని సమాచారం. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఆ రోపణలు ఎదురొంటున్న పది మంది ఎమ్మెల్యేల్లో 8 మంది విచారణ ముగిసింది. రెండోసారి కూడా నోటీసు అందుకున్న దానం ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదు. నోటీసుల గడువు నేటితో ముగియనుంది. శా సన వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబుతో శనివారం ఎమ్మెల్యే దానం భేటీ అయ్యారు.
అనంతరం అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులతో సమాలోచనలు జరిపినట్టు సమాచారం. అంతకుముందు రెండు రోజులు ఢిల్లీ లో ఉండి అధిష్ఠాన పెద్దలతో మాట్లా డి వచ్చిన దానం, వెంటనే శ్రీధర్‌బాబుతో భేటీ కావడం ప్రాధాన్యం సం తరించుకుంది. ఖైరాతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి గెలిచి సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేయడంతో ఆయనపై అనర్హత వేటు ఖాయమని న్యాయనిపుణులు చెబుతున్నారు. దీనికి ముందే తన రాజీనామా చేయాలని దానం యోచిస్తున్నట్టు సమాచారం.