మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర నేత దామోదర లొంగిపోతున్నట్లు మీడియా, సోషల్మీడియాలో వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ తెలిపారు. పోలీసులే ఉద్దేశపూర్వకంగా ఈ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు. గతంలో కూడా దామోదర ఎన్కౌంటర్లో చనిపోయారని, పోలీసుల ముందు లొంగిపోతున్నారని అనేకసార్లు దుష్ప్రచారం చేశారని ఆ లేఖలో గుర్తు చేశారు.
విప్లవ ప్రజలను గందరగోళ పరిచడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ లేఖలో జగన్ తెలిపారు. మంత్రి సీతక్కపై జూన్ 26వ తేదీన వచ్చిన పత్రికా ప్రకటనకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
జగన్ పేరిట విడుదలైన లేఖ