Damodar Raja Narasimha | హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వంలో కొందరు మంత్రుల రాజ్యమే నడుస్తున్నదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విమర్శలు గుప్పించారు. పక్క జిల్లాలకు కూడా హెలికాప్టర్‌పై వెళ్తున్నారని మండిపడ్డారు. సోమవారం మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేసిన ఆయన సొంతపార్టీ నేతలపై వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.
తాను ఒక్కసారి హెలికాప్టర్ ఎకలేదని తెలిపారు. హెలికాప్టర్ ఎకాలన్నా వాళ్లే.. వాటిని కొనాలన్న వాళ్లేనని విమర్శించారు. ఆ కొందరైతే హెలికాప్టర్ లేకపోతే కాలు బయటపెట్టడంలేదని ఎద్దేవా చేశారు. ఆ మంత్రుల కోసం వారు సెక్రటేరియట్‌పై హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని దెప్పిపొడిచారు.