మక్తల్, జనవరి 22 : కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా 150 పడకల దవాఖాన నిర్మాణం కోసం గతంలో భూమిపూజ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా స్థల పరిశీలన అని చెప్పి బుధవారం వైద్యారోగ్యశాఖ మంత్రి చేతుల మీదుగా మళ్లీ భూమిపూజ నిర్వహించింది. అప్పటి మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సర్వే నంబర్ 919లో ఐదు ఎకరాల విస్తీర్ణంలో 150 పడకల దవాఖాన నిర్మాణం చేపట్టాలని 2023 అక్టోబర్ 4న అప్పటి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చేతులు మీదుగా భూమిపూజ చేశారు. ఏడాది తర్వాత మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గత ప్రభుత్వంలో మంజూరైన దవాఖాన నిర్మాణ పనులకు ప్రస్తుత వైద్యారోగ్యశాఖ మంత్రి చేతుల మీదుగా భూమి పూజ చేయించడం చర్చనీయాంశంగా మారింది.