హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ సీజన్ నుంచి సమీకృత వరద నిర్వహణ వ్యవస్థ (ఐఎఫ్ఎంఎస్)ను అమల్లోకి తెచ్చేందుకు నీటిపారుదల శాఖ సన్నాహాలు చేస్తున్నది. ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్‌కుమార్ సోమవారం జలసౌధ నుంచి వర్చువల్‌గా స్టేట్ డ్యామ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. గోదావరి, కృష్ణా బేసిన్లలోని ఇతర రాష్ర్టాల అధికారులతో ఐఎఫ్ఎంఎస్ అమలుపై చర్చించారు.
బేసిన్ల వారీగా నీటివనరులపై ఉన్న ప్రాజెక్టులను, వాటి క్యాచ్మెంట్ ఏరియా, సీడబ్ల్యూసీ గేజ్ పాయింట్లను గమనంలోకి తీసుకుని వాతావరణ శాఖతో కలిసి సంయుక్తంగా ఈ సిస్టమ్‌ను రూపొందించారు. ఏ రోజు ఎక్కడ ఎంత వర్షపాతం నమోదవుతుంది? ఏ క్యాచిమెంట్ ఏరియా నుంచి, ఏ ప్రాజెక్టుకు ఎంత వరద వస్తుంది? అనే వివరాలను రియల్ టైమ్‌లో తెలుసుకునే విధంగా దీనిని రూపొందించారు. తద్వారా ఎగువ నుంచి వచ్చే వరదను ముందుగానే అంచనా వేసి ప్రాజెక్టుల నుంచి దిగువకు ఎప్పుడు, ఏ మేరకు వరదను విడుదల చేయాలో నిర్ణయించేందుకు, వరదు ముంపును నివారించేందుకు వీలుకలుగుతుంది. ఈఎన్సీ అనిల్‌కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని ఐఎఫ్ఎమ్ఎస్ను రూపకల్పన చేయించారు.
పోలవరం ప్రాజెక్టుపై సీఎస్ రామకృష్ణారావు సోమవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. నదుల అనుసంధాన ప్రాజెక్టులపై ఈ నెల 28న ప్రధాన మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ సమీక్ష జరిపారు.