ఇచ్చోడ, సెప్టెంబర్ 12 : కేసీఆర్ పాలనలోనే దళితులకు నిజమైన గౌరవం దక్కిందని, ఆయనకే తమ మద్దతు అని ముక్రా(కే) దళితులు పేర్కొన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే)లో కేసీఆర్కు మద్దతుగా డప్పులతో ర్యాలీతీసి , కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్ తన పాలనలో స్థానిక సంస్థలు, ఉపాధి రంగాల్లో 50 శాతం రిజర్వేషన్, మూడెకరాల భూమి, దళితబంధు తదితర పథకాలు అమలు చేసి దళితులకు నిజమైన ఆత్మబంధువు అయ్యారని కొనియాడారు.
నేడు రేవంత్ పాలనలో అంబేదర్ అభయహస్తం కింద ప్రతి దళిత కుటుంబానికి రూ.12 లక్షలు ఇస్తామన్న హామీ కాగితాలకే పరిమితమైందని విమర్శించారు. మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ సుభాష్, దళిత నాయకులు పాల్గొన్నారు.