బిజినేపల్లి, ఆగస్టు 29: దళితుల ఆర్థికాభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకంపై ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలను దహనం చేసి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న దళితబంధుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని పలువురు అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ విజయ్, చెన్న య్య, పవన్‌కుమార్, లక్ష్మణ్, మోహన్, రామకృష్ణ ఉన్నారు.