సంస్థాన్ నారాయణపురం: దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసున్న సీఎం కేసీఆర్ నిజమైన దళితుల ఆత్మ బంధువని జడ్పీటీసీ వీరమళ్ల భానుమతీగౌడ్ అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని సర్వేల్లో దళితవాడలో 100 మంది దళితుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దళిత సాధికారత పథకం ప్రవేశ పెట్టి దళిత బిడ్డల చీకటి బతుకుల్లో వెలుగులు నింపిన కేసీఆర్ సారును
దళితులందరం జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కట్టెల భిక్ష పతి, టీఆర్ఎస్ నాయకులు వీరమళ్ల వెంకటేశ్, ఎంపీటీసీ ఈసం యాదయ్య, టీఆర్ఎ స్వీ మునుగోడు అధ్యక్షుడు నలపరాజు రమేశ్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు వీరమళ్ల జంగయ్య, శంకరయ్య, మల్లేశ్, లింగయ్య, జగన్రెడ్డి పాల్గొన్నారు.