
దళిత బంధు ఒక స్కీం కాదు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చేపట్టిన ఒక ఉద్యమం. చరిత్రలో ఇది గొప్ప కార్యక్రమంగా నిలుస్తుంది. దేశ ప్రజలందరూ మరోసారి తెలంగాణ వైపు చూస్తున్నరు. నిన్నటి దాకా అవాకులు చవాకులు పేలిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎటుపోయిన్రు. నోట మాట వస్తలేదు పాపం. ఆ పార్టీలు ఎన్నో రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నయి.. మరి ఇసోంటి పథకం ఒక్కటైనా పెట్టిన్రా చెప్పాలి. -మంత్రి కొప్పుల ఈశ్వర్
ముఖ్యమంత్రి కేసీఆర్కు దళితులమంతా రుణపడి ఉంటాం. మా జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. దళిత బంధుకు రూ .500 కోట్లు విడుదల చేసి నియోజకవర్గం అంతటా పండుగ వాతావరణం నింపారు. దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేసే పనిలో ఇప్పటికే అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నెల 16న స్వయంగా ముఖ్యమంత్రే లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు. ప్రభుత్వం హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా గుర్తించడం మా అదృష్టం. -బండ శ్రీనివాస్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్