దళితుల కోసం ప్రవేశపెడుతున్న దళిత బంధు పథకం మా జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఇంటింటికీ ఈ పథకం వస్తుందన్న నమ్మకం ఉంది. తెలిసిన వాళ్లకే ఇస్తారని అనుకోవడం తప్పు.. అందరికీ వస్తయి.. అపోహ పడకండి.. బాధపడకండి. ఈ పథకంపై ఉన్న అపోహాలను తొలగించుకోవాలి. దళితులకు కేసీఆర్ ఎంతో మేలు చేస్తున్నారు. ఈ 10 లక్షలతో దళిత కుటుంబాలు డెవలప్ కావాలి. కేసీఆర్‌కు అండగా ఉంటాం. – శనిగరపు శిరీష ( మామిళ్లవాడ, హుజూరాబాద్ )
మమ్మల్ని గుర్తించి 10 లక్షల సాయం చేసి మా కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న కేసీఆర్‌కు ఎంతోరుణపడి ఉంటాం. ప్రతీ కుటుంబానికి దళిత బంధు వర్తింపజేస్తారనే నమ్మకం ఉంది. ఆర్థికంగా ఎదిగేందుకు రూ. 10 లక్షలను ఉపయోగించుకుంటాం. హుజూరాబాద్‌లో త్వరలో జరిగే ఉప ఎన్నికలో కేసీఆర్‌కు మద్దతుగా ఉంటాం. కేసీఆర్ మాకు అండగా ఉంటారనే నమ్మకం ఉంది. కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. – మొలుగు శివప్రియ ( మామిళ్ల వాడ, హుజూరాబాద్ )