Adluri Laxman | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లోని దళిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు మరోసారి అవమానం జరిగింది. ఆయన శాఖలకు కోత విధించారు సీఎం రేవంత్. ప్రస్తుతం అడ్లూరి లక్ష్మణ్ వద్ద ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖలు ఉన్నాయి. ఇక మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో.. లక్ష్మణ్ శాఖలకు కోత పెట్టారు. మంత్రి అడ్లూరి వద్ద ఉన్న మైనార్టీ సంక్షేమ శాఖను అజారుద్దీన్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న హోం శాఖ, మున్సిపాలిటీ, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ శాఖల్లో ఏదో ఒకటి అజారుద్దీన్‌కు ఇవ్వొచ్చు కదా..? అని దళిత నేతలు నిలదీస్తున్నారు. దళిత మంత్రికి కేటాయించిన శాఖల్లోనే కోత విధించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు మంత్రి పదవులు ఇచ్చినట్టే ఇచ్చి.. అప్రాధాన్యత శాఖలను కేటాయిస్తుందని మండిపడుతున్నారు. ప్రాధాన్యం లేని శాఖలు ఇచ్చి.. తామేదో దళిత ఎమ్మెల్యేలకు మంచి చేసినట్లు కాంగ్రెస్ నాయకత్వం అభిప్రాయ పడడం సరికాదని దళిత నేతలు నిప్పులు చెరుగుతున్నారు.
ఇక ఇవాళ తన శాఖల్లోని మైనార్టీ సంక్షేమ శాఖను అజారుద్దీన్‌కు కేటాయించి అడ్లూరి లక్ష్మణ్‌ను అవమానించారు. కొద్ది రోజుల క్రితం ఇదే మంత్రిని సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా బహిరంగంగా దూషించారు. అప్పుడు కూడా మంత్రి అడ్లూరి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు అడుగడుగునా అవమానాలు ఎదురవడాన్ని దళిత సమాజం తీవ్రంగా ఖండిస్తోంది.