వాసాలమర్రిలో దళితబంధు లబ్దిదారులకు యూనిట్ల పంపిణీ
Dalit Bandhu | ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో మంత్రి జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కలిసి దళితబంధు పథకం లబ్దిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి,

యాదాద్రి భువనగిరి : ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో మంత్రి జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కలిసి దళితబంధు పథకం లబ్దిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, ఎంపీటీసీ నవీన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. దళితబంధు పథకం అమలుతో వాసాలమర్రి గ్రామ దళితులు ఆర్థికంగా ఎదుగుతారని పేర్కొన్నారు. వాసాలమర్రి దళితులు సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టాలి. ఈ గ్రామ దళితులు ఆర్థికంగా విజయం సాధించి దేశానికే ఆదర్శంగా నిలవాలన్నారు. ఇవాళ తెలంగాణ సంక్షేమ పథకాల గురించి దేశమంతా మాట్లాడుకుంటున్నారని తెలిపారు. దళితబందు పథకం ప్రపంచానికే గొప్ప దారి చూపే పథకం అని కొనియాడారు. గొప్ప గొప్ప కలలు కని వాటిని సాకారం చేసే దమ్మున్న నాయకుడు కేసీఆర్ మాత్రమే అని మంత్రి స్పష్టం చేశారు.
అనంతరం ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మాట్లాడుతూ.. వాసాలమర్రి గ్రామం చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన భరోసాతో వాసాలమర్రి గ్రామ దళితుల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నది అని పేర్కొన్నారు. రూపాయి కూడా వృధా చేయకుండా ఆర్ధికంగా బలోపేతం కావాలి. దేశానికే ఆదర్శంగా నిలిచేలా వాసాలమర్రి దళితులు సమగ్రాభివృద్ధి సాధించాలి. మరోసారి వాసాలమర్రి దళితులకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని గొంగిడి సునీత పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

