హిమాయత్‌నగర్, డిసెంబర్ 29: తమ ప్లాట్లను ఆక్రమించి వేధింపులకు గురి చేస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావుపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగ, దళిత బహుజన ప్లాట్ ఓనర్స్ సొసైటీ ప్రతినిధి బృందం శుక్రవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కోరింది.
ఈ మేరకు ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని వంపుగూడ గ్రామంలో 706 ప్లాట్లను కొనగా, 2004లో ప్రేమ్‌సాగర్‌రావు తమ ప్లాట్లపై కన్నేసి నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించునేందుకు ప్రయత్నిస్తున్నారని, కట్టుకున్న ఇండ్లను అతని అనుచరులతో కూల్చివేయిస్తున్నాడని ఆరోపించింది. తమకు న్యాయం చేయాలని కోరింది.