కడ్తాల్, మార్చి 5: పాల బిల్లుల కోసం పాడిరైతులు వినూత్న నిరసనకు దిగారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాడిపశువులు సహా పాదయాత్రగా హైవేపై బయలుదేరి వెళ్తుండగా, పోలీసులు అడ్డుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలోని హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపైకి పశువులను తీసుకొచ్చిన పాడి రైతులు, బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ దారిపట్టారు. 80 రోజుల పాల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈలోగా స్థానిక పోలీసులు వారిని అడ్డుకొని, అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్‌నాయక్ తదితరులు మాట్లాడారు. విజయ డెయిరీ సంస్థ పాడి రైతులకు 80 రోజులుగా బిల్లులు చెల్లించకపోవడంతో పాడి రైతులకు పశుపోషణ భారమైందని ఆవేదన వ్యక్తంచేశారు. రోజువారీ ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులకు అప్పులు చేయాల్సిన దుస్థితి వచ్చిందని తెలిపారు. కడ్తాల్ పాల శీతలీకరణ కేంద్రం పరిధిలోనే సుమారు రూ.20 కోట్ల వరకు పాల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. పాల బిల్లులను వెంటనే చెల్లించాలని, లేనిపక్షంలో అసెంబ్లీతోపాటు మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ ఆందోళనలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, మాజీ జడ్పీటీసీ దశరథ్‌నాయక్, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు రామకృష్ణ, రాజేందర్‌యాదవ్, ప్రధాన కార్యదర్శి మహేశ్, పీఏసీఎస్ డైరెక్టర్ వీరయ్య, మాజీ సర్పంచులు కృష్ణయ్యయాదవ్, తులసీరాంనాయక్, హరిచంద్‌నాయక్, మాజీ ఎంపీటీసీలు గోపాల్, రమేశ్‌నాయక్, శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు నర్సింహ, రామచంద్రయ్య, మహేశ్, జగన్యాదవ్, శ్రీశైలంయాదవ్, పవన్, మల్లేశ్, నాగార్జున్, రాములుయాదవ్, రవి, రమేశ్, జగన్, రాజు, పకీరా, అంజి, బాబా, అమ్జాద్, రవి, శ్రీను, కుమార్, శ్రీకాంత్, చందర్, సాయికుమార్, పవన్‌కల్యాణ్ పాల్గొన్నారు.