హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ర్టానికి చెందిన సియంట్ ఫౌండేషన్(సియంట్ లిమిటెడ్) ఐదు వర్సిటీలకు రూ.7.5 కోట్ల సీఎస్సార్ నిధులు ప్రకటించింది. రాబోయే మూడేండ్ల కాలంలో యూనివర్సిటీల్లో ఇన్నోవేషన్, స్కిల్‌డెవలప్‌మెంట్, ఆంత్రప్రెన్యూర్‌షిప్ వ్యవస్థల అభివృద్ధికి ఈ నిధులు వెచ్చించనున్నది.
ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూహెచ్, పాలమూరు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీల్లో ఈ మొత్తాన్ని ఖర్చుచేయనున్నది. ఇందులోభాగంగా ప్రభుత్వ డిగ్రీకాలేజీలు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోని విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు కల్పిస్తారు. నారాయణపేట, మహబూబ్‌నగర్, వరంగల్ల్లో రూరల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు.