యాత్రికులే లక్ష్యంగా సైబర్ మోసాలు
పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లేందుకు ఇంటర్నెట్లో టూరిజం ప్యాకేజీల కోసం శోధించే యాత్రికులను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. చాలా మంది ఎక్కడి వెళ్లాలి, టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తున్న ప్యాకేజీలేమిటీ, విమాన టికెట్ ధరలు తదితర అంశాల గూర్చి గూగుల్‌పై ఆధారపడుతుంటారు.
- ప్రత్యేక ప్యాకేజీల పేరిట నేరగాళ్ల బురిడీ
- ఇంటర్నెట్లో ట్రావెల్స్‌పై జాగ్రత్త
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ): పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లేందుకు ఇంటర్నెట్లో టూరిజం ప్యాకేజీల కోసం శోధించే యాత్రికులను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. చాలా మంది ఎక్కడి వెళ్లాలి, టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తున్న ప్యాకేజీలేమిటీ, విమాన టికెట్ ధరలు తదితర అంశాల గూర్చి గూగుల్‌పై ఆధారపడుతుంటారు. ఆయా వెబ్సైట్లలోకి వెళ్లి కాంటాక్టు నంబర్లకు కూడా ఫోన్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్లను కొందరు బుట్టలో పడేస్తున్నట్టు ఇటీవలి ఉదంతాలు వెల్లడిస్తున్నాయి.
ఇటీవల ఫిర్యాదులు
తొమ్మిది మంది కుటుంబాలతో జమ్ము కశ్మీర్ పర్యటనకు వెళ్లాలని టూరిజం ప్యాకేజీ కోసం గూగుల్ సెర్చ్ చేశారు. ఎగ్జిబర్ట్కశ్మీర్ అనే వెబ్సైట్లో ఈ వివరాలను గుర్తించారు. ఇందులో ఉన్న కాంటాక్ట్సుతో మట్లాడారు. ఆరు రోజు ప్యాకేజీ ట్రిప్ రూ.3.75 లక్షలు చెప్పారు. ఢిల్లీ వరకు రావాలని అక్కడి నుంచి మొత్తం వాహనాలు, భోజనం, వసతి తమదేనని ఆరు రోజులపాటు అన్ని తామే చూసుకొంటామని చెప్పారు. ముందుగా డబ్బు చెల్లించాలని సూచించారు. పర్యటన తేదీలు చెప్పి బాధితులు రూ.3.75 లక్షలు చెల్లించారు. డబ్బు చెల్లించిన తరువాత అప్పటిదాక మాట్లాడిన ఫోన్లు స్విచాఫ్ అయ్యాయి.
అమర్నాథ్ యాత్రకు వెళ్లాలని గూగుల్ చేసిన బాధితులు క్రియేటింగ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వెబ్సైట్లోకి వెళ్లి, టూర్ ప్యాకేజీకి రూ.50వేల అడ్వాన్స్ చెల్లించారు. తీరా రేపు విమానం ఎక్కి వస్తున్నామని బాధితులు చెప్పగా, ఎక్కడికొస్తారు? అమర్నాథ్ యాత్ర బంద్ అయ్యిందని ఫోన్లు స్విచాఫ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్పై ఆధారపడి ప్యాకేజీలు బుక్ చేయవద్దని సైబర్‌క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ సూచించారు. నమ్మకమైన, పేరున్న ట్రావెల్స్‌ను ఎంచుకోవాలని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- cyber scams
- Pilgrims
- travels
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

