Cyber Crime | సైబర్ నేరాల నియంత్రణకు అధునాతన పోలీస్స్టేషన్లు : మంత్రి మహమూద్ అలీ
Cyber Crime | సైబర్ నేరాలు(Cyber Crime) పెరుగుతుండటంతో వాటిని నియంత్రించేందుకు అధునాతన పోలీస్స్టేషన్లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ(Minister Mahamood Ali) వెల్లడించారు.
మణికొండ : సైబర్ నేరాలు(Cyber Crime) పెరుగుతుండటంతో వాటిని నియంత్రించేందుకు అధునాతన పోలీస్స్టేషన్లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ(Minister Mahamood Ali) వెల్లడించారు. నేరాల నియంత్రణ కోసం అధునాత సౌకర్యాలు కల్పించి ప్రపంచంలోనే అత్యుత్తమ పోలీస్ వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగిలో నూతన పోలీస్‌స్టేషన్ (Police Station) భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హోంమంత్రి మాట్లాడారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థ (Telangana Police System) దేశంలోనే అత్యుత్తమ సేవలు అందిస్తుందని అన్నారు. ప్రపంచంలోనే జపాన్ పోలిసింగ్ మించిన స్థాయిలో తెలంగాణ పోలీసు వ్యవస్థను ఆధునీకరించామని తెలిపారు. రూ.580 కోట్ల నిధులతో దేశంలో ఎక్కడా లేనివిధంగా కమాండ్ కంట్రోల్(Command Controll)ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఉమ్మడి పాలనలో ఒకే ఒక్క కమిషనరేట్ ఉండగా నేడు తొమ్మిది కమిషనరేట్లను ఏర్పాటు చేశామన్నారు.
మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా షీ టీంలు, షీ పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేసి మహిళలకు సంపూర్ణ భద్రత కల్పిస్తున్నామని ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితా హరినాథ్‌రెడ్డి, చేవెళ్ల పార్లమెంటు సభ్యులు గడ్డం రంజిత్‌రెడ్డి,పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలెటి దామోదర్, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, కాలే యాదయ్య, సైబరాబాద్ సీపీ స్టిఫెన్ రవీంద్ర, ఐపీఎస్ అధికారులు అవినాష్ మహంతి, సాధన రష్మి పెరుమాల్,నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ దారుగుపల్లి రేఖయాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేష్‌యాదవ్, రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి, నాగపూర్ణశ్రీనివాస్, శ్రీకాంత్‌రావు, ఏఎస్సైలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

