హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఒకడిని అరెస్ట్ చేసినంత మాత్రాన పైరసీ ఆగిపోదని, అతడి స్థానంలో మరొకడు వస్తాడని, సైబర్ నేరాలను పూర్తిగా అరికట్టడం సాధ్యం కాదంటూ పైరసీ కేసును ఛేదించడంలో సీపీగా కీలక పాత్ర పోషించి, ప్రస్తుత హోంశాఖ కార్యదర్శి ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ చేసిన వ్యాఖ్య లు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అత్యాధునిక సాంకేతిక నైపుణ్యం ఉన్న దొంగలను ప ట్టుకున్నాక కూడా చోరీలు జరుగుతున్నాయ ని, కొందరిని అరెస్ట్ చేశామన్న కారణంతో సైబర్ నేరాలు ఆగిపోతాయనుకోవడం ఉటోపియన్ (అసాధ్యమైన ఆశ) అని ఆనంద్ పేర్కొన్నారు. పోలీసులే కాదు, ఎవరొచ్చినా ఈ తరహా నేరాలను పూర్తిగా అరికట్టలేమన్న ధోరణిలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్‌తో సి నీ ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది. అయితే, అరెస్ట్ అయినంత మాత్రాన పైరసీ ఆగబోదంటూ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో ను, పోలీసు వర్గాల్లో చర్చకు దారితీశాయి.
‘హ్యాకర్లు, హ్యాకింగ్ అనేవి కొనసాగుతూనే ఉంటాయి. ఒకడు పోతే మరొకడు వస్తాడు. వాడు మరింత టెక్నాలజీని ప్రదర్శిస్తాడు. కొందరిని అరెస్ట్ చేశామన్న కారణంతో పైరసీ లేదా సైబర్ నేరాలు పూర్తిగా ఆగిపోతాయనుకోవడం అసాధ్యం. పెద్ద పెద్ద దొంగతనాలకు పాల్పడిన సాంకేతిక నైపుణ్యం ఉన్న దొంగల ముఠాను పట్టుకున్న తర్వాత దొంగతనాలు, దాడులు, మోసాలు ఆగిపోయాయా? మనిషి ఉన్నంతకాలం ఈ రకాల నేరాలు కూడా జరుగుతూనే ఉంటాయి. వీటికి మన చేతిలో ఉన్న మార్గం నివారణ ఒక్కటే. ఈజీ మార్గాల్లో డబ్బు సంపాదించాలన్న కోరికలను తగ్గించుకోవాలి. సైబర్ క్రైమ్స్ పెరగడానికి అదే మూల కారణం. సైబర్ స్పేస్, అకౌంట్లను సేఫ్‌గా ఉంచుకునేందుకు చర్యలు తీసుకోవాలి. జీవితంలో ఏదీ ఫ్రీగా రాదని డైరెక్టర్ రాజమౌళి చెప్పినమాటే జీవిత సత్యం’ అని సీవీ ఆనంద్ ఎక్స్‌లో పేర్కొన్నారు.