హైదరాబాద్ : రాష్ట్ర నూతన డీజీపీగా సీవీ ఆనంద్ (DGP CV Anand) శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. పదవీ విరమణ పొందిన బి. శివధర్ రెడ్డి స్థానంలో ఆయన ఈ అత్యున్నత బాధ్యతలను చేపట్టారు. ఇప్పటివరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన ఆయనకు మూడు దశాబ్దాలకు పైగా పోలీస్, పరిపాలనా విభాగాల్లో అపారమైన అనుభవం ఉంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తానని పునరుద్ఘాటించారు. తెలంగాణ పోలీసు బాస్‌గా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్‌కు పలువురు ప్రముఖులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Encounter | ముఖానికి కేక్ పూశారని ముగ్గురి హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడి హతం..!
APSRTC | ఆర్టీసీ బస్సులో సీటు కోసం కొట్టుకున్న మహిళలు.. బాలిక పరిస్థితి విషమం
Goa school tragedy | గోవా స్కూల్లో విషాదం.. హాకీ ప్రాక్టీస్ చేస్తుండగా బంతి తలకు తగిలి బాలిక మృతి