Goa school tragedy | గోవా స్కూల్లో విషాదం.. హాకీ ప్రాక్టీస్ చేస్తుండగా బంతి తలకు తగిలి బాలిక మృతి
Goa school tragedy | పాఠశాలలో హాకీ శిక్షణ (Hockey Training) తీసుకుంటుండగా బంతి తలకు బలంగా తగిలి 13 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. గోవాలోని గుయిరింలోని సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న రుయీషా ఖర్సెల్ ఈ ఘటనలో మరణించింది. వేసవి సెలవులకు ముందు పాఠశాల చివరిరోజు కావడంతో విద్యార్థులు ఉత్సాహంగా హాకీ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు.
Goa school tragedy : పాఠశాలలో హాకీ శిక్షణ (Hockey Training) తీసుకుంటుండగా బంతి తలకు బలంగా తగిలి 13 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. గోవాలో (Goa) ని గుయిరింలోని సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న రుయీషా ఖర్సెల్ (Ruesha Karshar) ఈ ఘటనలో మరణించింది. వేసవి సెలవులకు ముందు పాఠశాల చివరిరోజు కావడంతో విద్యార్థులు ఉత్సాహంగా హాకీ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో జరగబోయే పోటీల కోసం సిద్ధమవుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. రుయీషా తలకు బంతి బలంగా తగలడంతో ఆమె మైదానంలోనే కుప్పకూలిపోయింది.
వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసినప్పటికీ అది రావడానికి సమయం పడుతుందని తెలుసుకుని పాఠశాల సిబ్బంది ఓ ప్రైవేట్ వాహనంలో రుయిషాను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదిక శుక్రవారం వస్తుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్కూల్ సమయంలోనే జరిగిందని ప్రిన్సిపాల్ ఫాదర్ మిల్చెస్టర్ ఫర్టాడో చెప్పారు. తన సోదరుడు సూరజ్‌ను చూసి స్ఫూర్తి పొందిన రుయీషా రెండేళ్ల క్రితమే హాకీ ఆడటం ప్రారంభించింది.
పదిహేనేళ్ల సూరజ్ గత నెలలో జరిగిన సబ్-జూనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో గోవా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. తన చెల్లెలు ఎప్పుడూ తన హాకీ స్టిక్నే వాడేదని, ప్రాక్టీస్ సెషన్ ముగియడానికి కేవలం పది నిమిషాలు ఉందనగా ఈ ఘోరం జరిగిందని సూరజ్ కన్నీటి పర్యంతమయ్యాడు. రుయీషా తల్లి ఓ ఇంట్లో పనిమనిషిగా, తండ్రి స్థానిక దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. కుమార్తె మరణవార్తతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ‘క్షమించు రుయీషా, నిన్ను కాపాడుకోలేకపోయాను. నన్ను వదిలి ఎందుకు వెళ్లిపోయావు? దయచేసి తిరిగిరా’ అంటూ ఆమె తల్లి గుండెలవిసేలా రోదించడం స్థానికులను కంటతడిపెట్టించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

