తలమడుగు, జూన్ 14: రైల్వే సిబ్బంది అప్రమత్తతతో పెనుప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కోసాయి రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం సాయంత్రం రైలు పట్టా తెగిపోయింది. సిబ్బంది గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించడం.. అదే సమయంలో ఆ రూట్లో ఆదిలాబాద్‌కు వస్తున్న ఇంటర్‌సిటీని సమీపంలో నిలిపివేయించారు. రైల్వే సిబ్బంది పట్టాలను సరి చేయడంతో సుమారు రెండు గంటల తరువాత ఇంటర్సిటీ ఆదిలాబాద్‌కు చేరుకొన్నది.