హైదరాబాద్ : రోడ్డు పక్కన కారు ఆపి అరటి పళ్లు తెచ్చేలోపే కారు మాయమైన(Car theft) సంఘటన నిజామాబాద్ పట్టణంలో(Nizamabad town) కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. కుద్రిత్ బేగ్ అనే వ్యక్తి కారు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఎప్పటి లాగే కిరాయి కోసం పట్టణంలోని చెన్నై షాపింగ్ మాల్ వద్ద నున్న అడ్డా వద్ద కారును నిలిపాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తి వచ్చి నాందేడ్‌కు వెళ్లాలని కుద్రిత్ బేగ్ కారును రూ.4 వేలకు కిరాయికి కుదుర్చుకున్నాడు.
ఇదే సమయంలో గాంధీ చౌక్ వద్దకు రాగానే సదరు కస్టమర్ అరటి పండ్లు తెమ్మని డ్రైవర్ కుద్రిత్ బేగ్‌ను కోరాడు. కారు పక్కకు ఆపి అరటి పండ్లు తీసుకుంటుండగా కిరాయి కుదుర్చుకున్న వ్యక్తి కారుతో పరారయ్యాడు. మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.