15 నుంచి సీయూఈటీ పరీక్షల నిర్వహణ
దేశంలోని పలు సెంట్రల్ యూనివర్సిటీల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) లు ఈ నెల 15 నుంచి ప్రారంభంకానున్నాయి. ఆ పరీక్షలను రెండు విడతల్లో ఆగస్టు 20 వరకు నిర్వహిస్తారు.
- రెండు విడతల్లో పరీక్షల నిర్వహణ
- మొత్తం 14.90 లక్షల దరఖాస్తులు
- మొదలైన అడ్మిట్‌కార్డుల డౌన్లోడింగ్
- వెల్లడించిన ప్రొఫెసర్ జగదీశ్‌కుమార్
హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): దేశంలోని పలు సెంట్రల్ యూనివర్సిటీల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) లు ఈ నెల 15 నుంచి ప్రారంభంకానున్నాయి. ఆ పరీక్షలను రెండు విడతల్లో ఆగస్టు 20 వరకు నిర్వహిస్తారు. తొలి విడత పరీక్షలు ఈ నెల 15న, రెండో విడత ఆగస్టు 4 నుంచి మొదలవుతాయి. మొదటి విడత పరీక్షల అడ్మిట్‌కార్డుల డౌన్లోడింగ్ మంగళవారం నుంచే ప్రారంభమైంది.
రెండో విడత అడ్మిట్ కార్డులను జూలై 31 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్‌కుమార్ వెల్లడించారు. ఈ పరీక్షలను దేశంలోని 500 నగరాలతోపాటు విదేశాల్లోని 10 నగరాల్లో నిర్వహిస్తామని మంగళవారం ఆన్లైన్లో ఆయన మీడియాకు తెలిపారు. ఈ నెల 17న నీట్ యూజీ ఎగ్జామ్స్ ఉన్న కారణంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులను ఎంచుకున్న విద్యార్థులకు రెండోవిడతలో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు తొలి ప్రాధాన్యంగా ఎంచుకున్న నగరాల్లోనే పరీక్ష కేంద్రాలను కేటాయించినట్టు చెప్పారు. సిటీ చాయిస్‌ను మార్చుకోవాల్సిన వారు.. cuet-ug@nta.ac.in ఈ మెయిల్ ఐడీ, 011-40759000 నంబర్ సంప్రదించి మార్చుకోవచ్చని సూచించారు. వివరాలకు https://cuet.samarth.ac.in ను చూడాలని కోరారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

