అగ్గువకే పోషకాహారం
ఆహార ధరల పెరుగుదలతో దేశంలో 71 శాతం మంది, ప్రపంచవ్యాప్తంగా 42 శాతం మంది పౌష్టికాహారాన్ని తీసుకోలేకపోతున్నారని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్(సీఎస్ఈ) ఈ మధ్యే వెల్లడించింది. తృణ ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, గింజలు, పాల పదార్థాలు, మాంసం తగిన మోతాదులో తీసుకోలేకపోతున్నారని, ఫలితంగా ఏటా 17 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది.
- ఎనిమిది టిప్స్తో సీఎస్ఈ ఈట్ లాన్సెట్ డైట్ ప్లాన్
- ఖరీదైన ఆహార పదార్థాలకు ప్రత్యామ్నాయాల సూచన
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ఆహార ధరల పెరుగుదలతో దేశంలో 71 శాతం మంది, ప్రపంచవ్యాప్తంగా 42 శాతం మంది పౌష్టికాహారాన్ని తీసుకోలేకపోతున్నారని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్(సీఎస్ఈ) ఈ మధ్యే వెల్లడించింది. తృణ ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, గింజలు, పాల పదార్థాలు, మాంసం తగిన మోతాదులో తీసుకోలేకపోతున్నారని, ఫలితంగా ఏటా 17 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది. పౌష్టికాహారం కోసం ఎక్కువ ఖర్చు చేయలేనివారి కోసం తక్కువ ఖర్చుతో సమతుల ఆహారాన్ని తీసుకొనే ప్రణాళికను సీఎస్ఈ సూచించింది. 8 సూచనలతో ఈట్ లాన్సెట్ రిఫరెన్స్ ఫుడ్ ప్లాన్ను విడుదల చేసింది.

తక్కువ ఖర్చుతో సమతుల ఆహారం
- కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోకుండా, తక్కువ ఖర్చులో దొరికే తెల్ల, పచ్చ జొన్నలు, సజ్జలు, రాగులను తీసుకోవచ్చు. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
- పప్పులకు బదులు చిక్కుళ్లు తీసుకోవచ్చు. చికుళ్లలో బీ విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని తీసుకోవటం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, పీచు అవసరాలను తీర్చుకోవచ్చు.
- మాంసం తీసుకోలేనివారు గుడ్లు తీసుకోవచ్చు. ఇందులో అమైనో ఆమ్లాలు, సూక్ష్మపోషకాలు ఉంటాయి.
- బాదం, వాల్నట్స్, పిస్తా, జీడిపప్పు, ఎండుద్రాక్ష వంటి డ్రైఫ్రూట్స్ కొనలేని వారు.. ప్రత్యామ్నాయంగా వేరుశనగ తినాలి. ఇది ప్రోటీన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది.
- యాపిల్, నారింజ తదితర ఖరీదైన పండ్లు కొనే స్థోమత లేనివారు సీజనల్ పండ్లు, కూరగాయలను తినాలి.
- ఎట్టిపరిస్థితుల్లోనూ భోజనాన్ని వృథా చేయొద్దు. సరుకులు అవసరాల మేరకే కొనాలి.
- శుద్ధి చేసిన తెల్ల చకెరతో కూడిన చేసిన వంటకాలు, పానీయాలకు దూరంగా ఉండాలి. లేకపోతే మధుమేహం, హృద్రోగ సంబంధ వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది.
- వారంలో ఒకసారి సరికొత్త ఆహారాన్ని రుచి చూడాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

