హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్న సీఎస్ సోమేశ్‌కుమార్‌తోపాటు వికారాబాద్ కలెక్టర్, ఆర్డీవోలపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మాజీ సైనికుల కోటా కింద మోమిన్‌పూర్ మండలం యెంకెపాల్ గ్రామంలోని 4 ఎకరాలకు సంబంధించి లక్ష్మీనారాయణరెడ్డికి పట్టాదార్ పాస్‌బుక్, టైటిల్ డీడ్ ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలను పాటించనందుకు గతంలో వారిపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. పట్టాదార్ పాస్‌బుక్ జారీ ప్రక్రియను ప్రారంభించామని, నాలుగు వారాల్లో వాటిని జారీ చేస్తామని స్పెషల్ జీపీ తెలిపారు. ధరణి పోర్టల్‌లో సరైన దరఖాస్తును సమర్పించాలని పిటిషనర్‌ను కోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో పాస్‌బుక్ టైటిల్ డీడ్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో కోర్టు ధిక్కార పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.