శనివారం 04 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 15:51:42

వీలున్న ప్రతిచోట మొక్కలు నాటాలి: సీఎస్‌

వీలున్న ప్రతిచోట మొక్కలు నాటాలి: సీఎస్‌

హైదరాబాద్‌: వర్షాకాలంలో యుద్ధప్రాతిపదికన మొక్కలు నాటాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదేశించారు. అర్బన్‌ ఫారెస్ట్‌లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అడవుల పునరుజ్జీవంతోపాటు ఆక్రమణల నుంచి కాపాడాలని సీఎస్‌ సూచించారు. రాష్ట్రంలో 129 చోట్ల 188 ఫారెస్ట్‌ బ్లాకుల్లో 1.60 లక్షల ఎకరాల్లో అభివృద్ధి చేయాలని వెల్లడించారు. హైదరాబాద్‌లో వీలున్న ప్రతిచోట మొక్కలు నాటాలని తెలిపారు. మొట్రో కారిడార్‌లో ఇరువైపులా, మెట్రో డిపోల వద్ద మొక్కలు నాటాలని చెప్పారు. కాంపా నిధుల కింద రూ.900 కోట్లతో అభివృద్ధి ప్రణాళికను కేంద్రానికి పంపాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీవో, డీఎఫ్‌వో, ఏజెన్సీలతో బ్లాక్‌స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఫారెస్టు బ్లాక్‌ల భూసమస్యలను వారంలోగా పరిష్కరించాలి చెప్పారు. నాటే ప్రతి మొక్క పురోగతిపై క్రమంతప్పకుండా సమీక్షిస్తామని వెల్లడించారు.


logo