YTDA | వైటీడీఏ పరిధిని మరింత విస్తరించాలి : సీఎస్ శాంతికుమారి
YTDA | యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని మరింత విస్తరించి, స్వీయ ఆదాయ మార్గాలను పెంచుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులకు సూచించారు. బీఆర్కే భవన్లో వైటీడీఏ, శిల్పారామాల అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
YTDA | యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని మరింత విస్తరించి, స్వీయ ఆదాయ మార్గాలను పెంచుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులకు సూచించారు. బీఆర్కే భవన్లో వైటీడీఏ, శిల్పారామాల అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం వైటీడీఏ పరిధిలో ఏడు గ్రామాలే ఉన్నాయని, ఈ పరిధిని మరింత విస్తరించాలని సూచించారు. ఇందుకు ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. దేవస్థాన పరిసర ప్రాంతాలను, గ్రామాలను అభివృద్ధి పరిచి స్వీయ ఆదాయ వనరులు పెంచుకోవాలన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నిర్మాణం అద్భుతంగా ఉందని, రాబోయే రోజుల్లో తిరుమల తరహాలో మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో దేవస్థానం సంబంధించిన ఆడిట్ నివేదికలను, శిల్పారామాల పనితీరును సమీక్షించారు. సమావేశంలో ఆర్థిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, దేవాదాయశాఖ కమిషన్ అనిల్ కుమార్, వైటీడీఏ వీసీ కిషన్ రావు, యాదాద్రి దేవస్థానం ఈవో గీత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

