Vice President | 27న హైదరాబాద్‌కు ఉప రాష్ట్రపతి.. ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశం
Vice President | ఈ నెల 27న హైదరాబాద్‌కు భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధంఖర్ రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం పర్యటన ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
Vice President | ఈ నెల 27న హైదరాబాద్‌కు భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధంఖర్ రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం పర్యటన ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఉప రాష్ట్రపతి రాష్ట్రంలో తొలి పర్యటన కావడంతో పోలీసు బందోబస్తుతో పాటు పోలీస్ బ్యాండ్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పర్యటన సందర్భంగా పటిష్టమైన భద్రత కలపించాలని ఆదేశించారు. ఆరోగ్యశాఖ, ఆర్అండ్బీ, జీహెచ్ఎంసీ, ఇంధనశాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమావేశంలో డీజీపీ రవిగుప్తా, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, ఆరోగ్యశాఖ కమిషనర్ క్రిస్టినా, ఆర్అండ్బీ కార్యదర్శి శ్రీనివాస్‌రాజు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

