హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 15 రెవెన్యూ డివిజన్లకు ఐఏఎస్ అధికారులను సబ్ కలెక్టర్లుగా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఈ నియామకాలు చేపట్టినట్టు పేర్కొన్నారు.
ఉట్నూరు, భద్రాచలం, కాటారం, బాన్సువాడ, కల్లూరు, కాగజ్నగర్, బెల్లంపల్లి, అచ్చంపేట, మిర్యాలగూడ, దేవరకొండ, భైంసా, ఆర్మూర్, బోధన్, నారాయణఖేడ్, తాండూర్ రెవెన్యూ డివిజన్ల బాధ్యతలను ఐఏఎస్లకు అప్పగించారు.