హైదరాబాద్, ఆగస్టు23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల హాస్టళ్లను నెలలో ఒకరోజు తప్పక విజిట్ చేయాలని, రాత్రి అక్కడే నిద్రించాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
జిల్లా జ్యురిస్డిక్షన్ పరిధిలోని గురుకులాలు, సంక్షేమహాస్టళ్లను నెలలో ఒకరోజు తప్పక సందర్శించాలని పేర్కొన్నారు. గురుకులాల, హాస్టళ్ల పనితీరును మెరుగుపరచాలని సూచించారు.