హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారిని నియమించినందుకు సీఎం కేసీఆర్కు తమిళనాడు మాజీ సీఎస్, జనసేన పార్టీ సలహాదారు, ప్రముఖ కాపు సమాజం నాయకుడు ఆర్ రామ్మోహన్రావు ధన్యవాదాలు తెలిపారు. బుధవారం ప్రగతి భవన్లో బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, నాయకుడు పార్థసారథితో కలిసి సీఎం కేసీఆర్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.