హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): . జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2023 -24 హరితహారం కార్యక్రమంలో ప్రాజెక్టుల కింద ఉన్న అనువైన భూములను, బృహత్ ప్రకృతి వనాల కోసం అటవీ భూములను గుర్తించాలని ఆదేశించారు. ఏప్రిల్ నెలాఖరు కల్లా హరితహారం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. అగ్నిప్రమాదాల నివారణకు అన్ని ప్రభుత్వ విభాగాలతో పాటు ప్రజలనూ భాగస్వాములను చేయాలని, ముందు జాగ్రత చర్యలపై ప్రజల్లో చైతన్యం తేవాలని చెప్పారు. ఏప్రిల్ 4 నుంచి 13 వరకు జరుగనున్న పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
పేదలకు నివాస భూముల పంపిణీ కోసం రాష్ట్రంలో గుర్తించిన 1,039 ఎకరాలకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికలను పంపాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, రవాణా, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితా రాణా, అగ్నిమాపక శాఖ డీజీ వై నాగిరెడ్డి, పీసీసీఎఫ్ డోబ్రియల్ తదితరులు పాల్గొన్నారు.